రాములోరి పట్టాభిషేకం కోసం నేడు భద్రాచలానికి తమిళిసై

హైదరాబాద్, వెలుగు: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవుతున్నారు. గురువారం రాత్రి మణుగూరు ఎక్స్ ప్రెస్ లో బయల్దేరి శుక్రవారం ఉదయం కొత్తగూడెం చేరుకుంటారు. భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్ హౌజ్​లో బస చేస్తారు. రాములోరి పట్టాభిషేకంలో పాల్గొన్న తర్వాత పర్ణశాలను సందర్శిస్తారు. శుక్రవారం రాత్రి కొత్తగూడెం నుంచి బయల్దేరి శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు.