తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సీఎంవో ఆఫీసులో కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి దామోదరం (55) కరోనా బారినపడ్డారు. దాంతో ఆయనను రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందారు.
గతంలో జూన్ 5న సీఎంవో కార్యాలయ సిబ్బందికి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కరోనా పరీక్షలు నిర్వహించింది. అప్పుడు దామోదరంకు కరోనా నెగిటివ్ వచ్చింది. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ఆయన శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడటంతో ఆస్పత్రిలో చేరారు. దాంతో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. దామోదరం 2011లో జయలలిత సీఎంగా ఉన్నప్పటి నుంచి సీఎం చాంబర్ కు కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
For More News..