ఏపీలో వర్ష బీభత్సం.. నిలిచిపోయిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్

ఏపీలో వర్ష బీభత్సం.. నిలిచిపోయిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలదపడటంతో తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలాచోట్ల వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంతో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రాయపాడు వద్ద నిలిచిపోయింది. 

Also Read:-శ్రీశైలం ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండచరియలు రాకపోకలు బంద్

రైల్వే ట్రాక్ పైకి నీళ్లు చేరటంతో రైలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ట్రాక్ పై పూర్తిగా నీళ్లు ఉండడంతో సహాయక చర్యలు  ఆటంకం కలుగుతోంది. రాయపాడు వద్ద బుడమేరు కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది, సహాయక చర్యలు అందించేందుకు రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని సమాచారం. రైల్వే అధికారులు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది కోసం వేచి చూస్తున్నారని సమాచారం.