తమిళ స్టార్ హీరో విజయ్(Vijay), స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) కాంబోలో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ లియో(Leo). అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్, ట్రైయిర్ అంచనాలు పెంచేయగా.. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే లియో రిలీజ్ రోజు పెద్దఎత్తున సంబరాలు ప్లాన్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.
అయితే తాజాగా విజయ్ ఫ్యాన్స్ కు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. లేవు సినిమా స్పెషల్ షోకు పర్మిషన్ లేదు. అలాకాదని ఎవరైనా షోలు వేయాలని గొడవకు దిగితే మాత్రం.. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అముత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. తమ అభిమాన హీరో సినిమాకు సంబరాలు చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక లియో సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను లలిత్ కుమార్, జగదీశ్ పళనిసామి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.