తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన కంగువ సినిమా నవంబర్ 14 న ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ శివ దర్శకత్వం వహించగా సినీ నిర్మాతలు ప్రమోద్ రెడ్డి, జ్ఞానవేల్ రాజా, వంశీ కృష్ణ రెడ్డి తదితరులు కలసి యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై నిర్మించారు.
ఈ సినిమా కోసం దాదాపు రూ.350 కోట్లు బడ్జెట్ ని ఖర్చు చేశారు. ఇక ఈ సినిమాలో సూర్య కి జంటగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటాని నటించగా యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ALSO READ | అందరికళ్లు సూర్యవైపే.. నవంబర్ 14న థియేటర్లలోకి కంగువ
అయితే కంగువ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో తమిళనాడు గవర్నమెంట్ సూర్య ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చింది. నవంబర్ 14న కంగువ మార్నింగ్ షోస్ కి పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాని ఉదయం 4.00 గంటలకి చూడాలనుకున్న సూర్య ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. కానీ రోజువారీ షోస్ కంటే ఒక షో ఎక్కువ వేసేందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయం చిత్ర యూనిట్ కి కొంతమేర ఊరట కలిగించింది.
అయితే తెలుగులో మాత్రం మార్నింగ్ షోలకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. దీంతో నవంబర్ 14న ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ మరియు కర్నాటకలో ఉదయం 4 గంటలకు ప్రదర్శించబడుతుంది. దీంతో తెలుగు, మలయాళం ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.