AP News:  తిరుమల పోలీసుల అదుపులో తమిళ యూట్యూబర్  .. ఎందుకంటే..

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం వేల సంఖ్యల భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారు. శ్రీవారి క్షేత్రంలో అణువణువు గోవిందమయం అని భక్తులు భావిస్తారు. ఎంతో భక్తిశ్రద్దలతో నడుచుకుంటారు. అటువంటి కొండపై భక్తితో నడుచుకోవాల్సింది పోయి కొందరు ఆకతాయిలు.. వెకిలి చేష్టలు, కోతి వేషాలు వేశారు. తిరుమలలో తమిళ యూటూబర్స్ రెచ్చిపోయారు. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించారు. ప్రాంక్ వీడియోలతో భక్తులను ఎగతాళి చేశారు.

తిరుమల  శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తిరుమల సర్వదర్శనం క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు చేసిన తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన యూట్యూ బర్ వి. వైకుంఠవాసన్ (వీవీవాసన్), ఇతని స్నేహితుడు గోవిందరాజ రామస్వామిని తిరుమల టూటౌన్ పోలీసులు సోమవారం ( జులై 16)  అరెస్టు చేశారు. వీడియోలు ఇటీవల సామాజిక మాధ్య మాల్లో వైరల్ కావడం, భక్తుల నుంచి పెద్దఎత్తున అభ్యంతరం వ్యక్తం కావడం తెలిసిందే. ఆలయ గౌరవానికి భంగం కలిగిం చడం, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, శాంతిభద్రతల సమస్యకు కారణమవడం వంటివాటిపై టీటీడీ లోని ఐటీలోని సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారి తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ సత్యనారాయణ నిందితులను అరెస్ట్ చేశారు.  వారిని తిరుమలకు తీసుకువచ్చాక పూర్తిగా విచారించి వీడియో చేయడానికి గల కారణాలు, అసలు ఉద్దేశాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా శిక్షిస్తామన్నారు. 

ALSO READ | తిరుమలలో త్వరలో FSSAI  ల్యాబ్​ ఏర్పాటు.. అన్నప్రసాదం తయారీ పదార్దాలు చెకింగ్​ 

తమిళనాడుకు చెందిన యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్, అతని మిత్రులు   తిరుమలకు వచ్చారు. అయితే వారు మొబైల్ ఫోన్లతో దర్శనం క్యూ లైన్లలోకి ప్రవేశించారు. నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లిన వాసన్ మిత్రుడు ఒకరు.. కంపార్ట్మెంట్ తాళాలు తీసే సిబ్బందిగా నటించాడు. అయితే అది నిజమేనని భావించిన భక్తులు క్యూలైన్ గేట్ తాళాలు తీస్తున్నారనుకుని ఒక్కసారిగా లేచి నిల్చున్నారు. అయితే ప్రాంక్ చేసిన అతడు.. వెకిలి నవ్వు నవ్వుతూ పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబర్​  వాసన్ ఇన్​ స్టా గ్రామ్ లో  పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో తమిళనాడులో వైరల్​ అయింది.