తమిళనాడు,కేరళలో కొనసాగుతున్న కర్ఫ్యూ

తమిళనాడులో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలెవరూ బయటకు రాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోజురోజుకు రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కార్ నైట్ కర్ఫ్యూతో పాటు.. ఆదివారం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తోంది. నిన్న ఒక్కరోజే తమిళనాడులో 30 వేల 744 కరోనా కేసులు బయటపడ్డాయి. 33 మంది మరణించారు. రాష్ట్రంలో  లక్షా 94 వేల 697 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మాస్కులు పెట్టుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు తమిళనాడు అధికారులు 

ఇటు కేరళలో కూడా వీకెండ్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలకు మినహా..ఏ వాహనాలను రోడ్డుపైకి అనుమతించడం లేదు. కేసులు భారీగా పెరుగుతున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి కావడంతో అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ రోజుకు 40వేలకు తగ్గకుండా కేసులు వస్తున్నాయి. మరణాలు సైతం పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినం చేశారు. 

మరిన్ని వార్తల కోసం

నాలుగు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కేసులు

కేరళలో ఇవాళ కూడా 45వేలు దాటిన కేసులు