చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం : తమ్మడబోయిన అర్జున్

  •     బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ 

మిర్యాలగూడ, వెలుగు : లోక్​సభ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్​అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ బీఆర్ఎస్​ దోపిడీ విధానాలకు పరాకాష్టగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. ప్రజాస్వామిక విధానాలను అమలు చేసే కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించి స్థిరమైన పరిపాలనకు మద్దతుగా నిలవాలని కోరారు.