ఇసుక మాఫియా అక్రమాలపై సీఎంకు లేఖ

జమ్మికుంట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్​తమ్మేటి సమ్మిరెడ్డి సీఎం రేవంత్‌‌రెడ్డికి లెటర్​రాశారు. ఆదివారం వీణవంక మండలంలోని కొండపాక గ్రామంలో మానేరు పరివాహక ప్రాంతంలో ఆయన మాట్లాడారు. మానేరులో చెక్‌‌డ్యాంల నిర్మాణం పేరుతో మానేరులో విచ్చలవిడిగా ఇసుక క్వారీలు ఏర్పాటు చేసి రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. 

దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  టీఎస్ ఎండీసీ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ లీడర్లు కుమ్మక్కై వీణవంక, జమ్మికుంట మండలాల్లో ఇసుక దందాకు తెరలేపారని ఆరోపించారు. ఎన్నికల టైంలో కరీంనగర్ కలెక్టర్ ఇసుక క్వారీల నిర్వహణను మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, వాటిని రద్దు చేయాలని కోరారు. సమావేశంలో లీడర్లు రాజకుమార్, సుంకరి రమేశ్‌‌, ఎండీ సలీం, సాహెబ్ హుస్సేన్, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.