ఖమ్మం కోర్టులో లొంగిపోయిన తమ్మినేని కోటేశ్వరరావు

టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో కీలక నిందితులుగా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు, ఎల్లంపల్లి నాగయ్య ఖమ్మం కోర్టులో లొంగిపోయారు. కృష్ణయ్య హత్య జరిగినప్పటినుంచి వారిద్దరు పరారీలో ఉన్నారు. కోటేశ్వరరావును పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కృష్ణయ్య కుటుంబసభ్యులు ఆరోపించారు. తాజాగా కేంద్రమంత్రి బిఎల్ వర్మ ఎదుట ఇదే విషయం కుటుంబసభ్యులు ప్రస్తావించారు. 

ఆరు నెలల ముందే మర్డర్​ ప్లాన్..

కృష్ణయ్య హత్య జరగడానికి రెండ్రోజుల ముందే తాను త్వరలోనే దుబాయ్​ పోతున్నట్టుగా కోటేశ్వరరావు కొంతమంది సన్నిహితులకు చెప్పినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మర్డర్​ కు ముందు ఒక పెళ్లికి సంబంధించి బంధువులు కోటేశ్వరరావుకు ఇన్విటేషన్ ఇచ్చేందుకు​ రాగా, దుబాయ్ వెళ్తున్నానని​ శుభకార్యానికి రాలేనని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆర్నెళ్ల క్రితం మర్డర్​ ప్లాన్ వేసినట్టుగానే, హత్య తర్వాత ఎక్కడికి వెళ్లాలనే స్కెచ్​ కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం కోటేశ్వరరావు కోసం తాము గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.

అగస్ట్ 15 తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. బైక్ పై వెళ్తున్న ఆయనను దండగులు కిరాతకంగా పొడిచి చంపారు.  కోటేశ్వరరావుతో విభేధాలు రావడంతో కృష్ణయ్య ఇటీవలె టీఆర్ఎస్ లో చేరినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అనుచరుడిగా కొనసాగారు. తన తండ్రి హత్యకు కోటేశ్వరరావు సహా ఆరుగురు వ్యక్తులు కారణమని కృష్ణయ్య కొడుకు నవీన్ గతంలో పోలీసులకు ఫర్యాదు చేశారు.