తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు

ఖమ్మం జిల్లా : పాలేరు నియోజకవర్గంలో సీపీఎం జన చైతన్య యాత్రలో తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గం తమకు మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. ‘ రేపటి నుంచి పాలేరులో నేనా..? మా బావ కందాళ ఉపేందర్ రెడ్డినా..? పోటీలో ఉండేది ఎవరు..? అని గ్రామాల్లో బాగా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్, సీపీఎం పొత్తులో భాగంగా సీటు మాకు కేటాయించినా.. ఉపేందర్ రెడ్డి అంతే అంకితభావంతో పని చేస్తారు. ఉపేందర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే సీపీఎం పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుంది.

ఒకవేళ ఉపేందర్ రెడ్డి పోటీలో ఉంటే సీపీఎం ప్రతి ఓటు ఆయనకే పడుతుంది’ అని చెప్పారు. మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా సీపీఎం పోరాటం కొనసాగించాలని తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు బీఆర్ఎస్, వామపక్షాల కూటమి గెలవబోతుంది అని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి చెప్పారు.