పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్మించాలి

 పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్మించాలి
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం 

హనుమకొండ సిటీ, వెలుగు: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హనుమకొండలోని గిరిజన భవన్​లో పార్టీ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి అధ్యక్షతన మంగళవారం  నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభకు  ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాయుధ రైతాంగ పోరాటాన్ని కొందరు  హిందూ, ముస్లింల వ్యతిరేక పోరాటంగా చితీకరిస్తున్నారన్నారు.

హిందూ, ముస్లిం తేడా లేకుండా సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత విముక్తి కోసం సాగిన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమన్నారు. ఆ పోరాట కర్తవ్యాలు ఇంకా పూర్తి కాలేదన్నారు. ఈ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సారంపెల్లి వాసుదేవరెడ్డి, ఎం.చుక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు రాగుల రమేశ్​, గొడుగు వెంకట్, డి.తిరుపతి, జి.రాములు, కాడబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.