కరెంట్​ కోతలకు నిరసనగా నేషనల్ హైవే 161పై ఆందోళన

కరెంట్​ కోతలకు నిరసనగా నేషనల్ హైవే 161పై ఆందోళన

అల్లాదుర్గం, వెలుగు: కరెంట్​ కోతలకు నిరసనగా మండదలంలోని గొల్లకుంట తండా వాసులు శనివారం నేషనల్ హైవే 161పై ఆందోళన చేశారు. విద్యుత్​ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం రాత్రి కొద్దిపాటి వర్షానికే  గొల్లకుంట తండా జీపీకి  కరెంటు సరఫరా నిలిపి వేశారని దీంతో  దొంగలు మేకలు ఎత్తుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో అకోలా నాందేడ్ నేషనల్ హైవే పనులు మొదలు పెట్టినప్పుడు తండాకు వెళ్లే లైను మార్చారని అప్పటి నుంచి కరెంటు సమస్య మొదలైందన్నారు.  పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. హైవేపై ధర్నాకు దిగడంతో గంటసేపు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ధర్నా స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడి హైవేపై నిలిచిన వాహనాలను క్లియర్ చేశారు.