నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోందని టీమ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ షెడ్యూల్‌లో నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు ఇతర నటీనటులపై కీలకమైన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్టు చెబుతూ.. షూట్ డైరీస్ పేరుతో కొన్ని ఫొటోస్‌ను విడుదల చేశారు.
సెట్స్‌లో ఇంటెన్స్, ప్యాషన్‌తో నిండిన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఇందులో చైతూ గడ్డం పెంచి రగ్డ్ గెటప్‌లో కనిపిస్తుంటే, సాయి పల్లవి సంప్రదాయబద్దంగా క్యూట్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నాడు. అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపించనుంది. వీరిద్దరి మధ్య అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీ ఉండబోతుందని మేకర్స్ చెప్పారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటీనటుల గెటప్‌లు, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్‌గా కనిపించేలా చూసుకుంటున్నాం అన్నారు. త్వరలో కొన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్స్ ఇస్తామన్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.