కల్లూరు, వెలుగు : ఖమ్మం అభివృద్ధి కోసం బీజేపీ ఓటు వేయాలని ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు పిలుపునిచ్చారు. గురువారం కల్లూరు మండల కేంద్రంలో కృష్ణ ఫ్రూట్ మార్కెట్ నుంచి నేషనల్ హైవే ప్రధాన రహదారి మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ఖమ్మంపై దృష్టి పెట్టారని, ఇప్పటికే పార్టీ అగ్ర నేతలు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వచ్చారని
త్వరలో మోదీ కూడా ఖమ్మం వస్తారని చెప్పారు. తనను గెలిపిస్తే ఖమ్మానికి పామాయిల్ బోర్డు, పత్తి, మిరప గిడ్డంగులు, పరిశ్రమలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ కన్వీనర్ వీరంరాజు, అసెంబ్లీ ఇన్చార్జి బెల్లంకొండ రవితేజ, జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు నాయకులు పాల్గొన్నారు.