ఆద్యంతం అద్భుతం..హీరో విక్రమ్ తంగలాన్ రివ్యూ

 ఆద్యంతం అద్భుతం..హీరో విక్రమ్ తంగలాన్ రివ్యూ

కథ, క్యారెక్టర్, లుక్స్ పరంగా అపరిచితుడు, ఐ,శివపుత్రుడు లా చాల డిఫరెంట్ గా వుండేలా చూసుకునే హీరో విక్రమ్, కబాలి, కాల లాంటి ప్రత్యేకమైన మూవీస్ ను తెరకెక్కించే డైరెక్టర్ పా. రంజిత్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ తంగలాన్.టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన తంగలాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పా రంజిత్ తనదైన స్టైల్ ఆఫ్ డైరెక్షన్ చూపించాడా, విక్రమ్ యాక్షన్ ఏవిధంగా వుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

బ్రిటీష్ వాళ్లు మనల్లి పాలిస్తున్న 1850 నాటి కాలం.వెప్పూరు అనే ఊరిలో తంగలాన్, గంగమ్మ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ సంతోషంగా వుంటారు. తరచుగా తన తాతను ఆరతి అనే నాగకన్య తరుముతున్నట్టుగా ఆయనకు కలలు వస్తూ వుంటాయి.అయితే ఒకరోజు చేతికొచ్చిన పంటను ఎవరో తగలబెడతారు. దాంతో పన్నులు కట్టలేక పోవడంతో తంగలాన్ కుటుంబాన్ని వెట్టిచాకిరీ చేయాలని జమిందారు ఆదేశిస్తాడు.అదే టైంలో ఇంగ్లీష్ దొర క్లెమెంట్ బంగారు గనులు తవ్వడానికి వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానని ఆశ చూపించడంతో వారితో వెళ్లిపోతాడు.

తంగలాన్ కు తరచు కలలో వచ్చే ఆరతి బంగారు గనుల తవ్వకాలకు వెళ్లినప్పుడు తంగలాన్ కు ఎదరురవుతుంది.బంగారాన్ని కాపాడడానికి నాగకన్య ఆరతి తంగలాన్ కు అనేక రకాలుగా అడ్డుకుంటుంది.దీంతో తంగలాన్ ఏం చేస్తాడు. వారికి బంగారు దొరుకుతుందా.తంగలాన్ కుటుంబంతో పాటు ఊరి జనాలు కూడా బంగారం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఏమవుతాయి.అసలు నాగకన్య ఎవరు.నాగకన్య కు తంగలాన్ ను ఎందుకు అడ్డుకుంటుంది. ఆమెను అంతం చేయాలనుకున్న తంగలాన్ చివరకు ఏం చేస్తాడు అనేది స్టోరీ.

మూవీ స్టార్టింగ్ లో పాత్రల పరిచయం కోసం కొద్దిగా ల్యాగ్ అనిపించినా స్టోరీ సాగుతున్న విధానం ఆద్యంతం అద్భుతంగా వుంటుంది. సెకండాఫ్ లో ఒకటి రెండు సీక్వెన్స్ లు తప్ప అనవసరం అనిపిస్తుంది. క్లైమాక్స్ మూవీకే హైలైట్. ప్రతీ ఫ్రేమ్ లో డైరెక్టర్ పా. రంజిత్,హీరో విక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సినిమాటోగ్రఫర్ ఎ.కిశోర్ కుమార్ తమ పూర్తి శక్తినంతా పెట్టిన ఫిల్ తెలుస్తుంది.విక్రమ్ మేనరిజమ్, యాక్షన్ ,పాత్ర పట్ల అంకితభావం మరోసారి ప్రేక్షకుడిని కట్టి పడేస్తుంది. గంగమ్మగా పార్వతి తిరువోతు, ఆరతి పాత్రలో మాళవికా మోహన్ లు కూడా ఏమాత్రం తగ్గకుండా తమ పాత్రలకు ప్రాణం పోశారు.

బంగారం, కుల వ్యవస్థ, సహజ వనరుల దోపిడి, నమ్మించి మోసం చేసే తెల్లవాడి బుద్ది తో పాటు దురాశ దుఖానికి చేటు లాంటి అనేక విషయాలను అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ పా. రంజిత్.