
తంగళ్లపల్లి, వెలుగు : రాజన్నసిరిసిల్లి జిల్లా తంగళ్లపల్లి మండల జడ్పీటీసీ పూర్మాణి మంజులతోపాటు ఆమె భర్త, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్మాణి లింగారెడ్డి ఆదివారం బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ నుంచి మంజుల రెండుసార్లు తంగళ్లపల్లి జడ్పీటీసీగా గెలుపొందారు. పార్టీలో తమకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం వల్లే రాజీనామా చేసినట్లు జడ్పీటీసీ దంపతులు తెలిపారు.