విలేజ్ డిటెక్టివ్‌‌‌‌గా ..తనికెళ్ల భరణి

విలేజ్ డిటెక్టివ్‌‌‌‌గా ..తనికెళ్ల భరణి

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో రూపొందనున్న  క్రైమ్ థ్రిల్లర్ ‘అసుర సంహారం’. కిషోర్ శ్రీకృష్ణ దర్శకుడు. సాయి శ్రీమంత్, శబరీష్ బోయెళ్ళ నిర్మాతలు. విలేజ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కనున్న  ఈ చిత్రంలో మిధున ప్రియ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్  పనులు శరవేగంగా  జరుగుతున్నాయి. 

త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.  ఇందులో  తనికెళ్ల భరణి విలేజ్ డిటెక్టివ్‌‌‌‌గా  విభిన్నమైన  పాత్ర పోషించనున్నారని, ఇతర నటీనటులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కరీం అబ్దుల్ సంగీతం అందించనున్నారు.