అనంతగిరి ఘాట్ రోడ్డులో ట్యాంకర్ బోల్తా.. డ్రైవర్​కు తీవ్ర గాయాలు

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్ లో ఓ కెమికల్ ​ట్యాంకర్​  బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి తాండూర్ కు సిమెంట్ లో కలిపే కెమికల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ బుధవారం మధ్యాహ్నం అనంతగిరి ఘాట్ కు వచ్చే సరికి అదుపు తప్పింది.  

రోడ్డు పక్కన బోల్తా పడగా డ్రైవర్​ అందులోనే చిక్కుకుపోయాడు.   పోలీసులు వచ్చి డ్రైవర్ కైలాశ్​ను బయటికి లాగారు. తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ఏరియా హాస్పిటల్​కు తరలించారు.