
హైదరాబాద్, వెలుగు: సిక్కింతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ప్లేట్ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజే భారీ ఆధిక్యాన్ని సాధించింది. తన్మయ్ అగర్వాల్ (137), రాహుల్ సింగ్ (83), రోహిత్ రాయుడు (75), తిలక్ వర్మ (70 బ్యాటింగ్) చెలరేగడంతో ఆట ముగిసే టైమ్‌కు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 62 ఓవర్లలో 381/3 స్కోరు చేసింది.
తిలక్‌తో పాటు చందన్ సహానీ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సిక్కిం తొలి ఇన్నింగ్స్‌లో 27.4 ఓవర్లలో 79 రన్స్‌కే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లు తనయ్ (6/25), మిలింద్ (4/30) ప్రత్యర్థి బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు. అంకూర్ మాలిక్ (17) టాప్ స్కోరర్. ప్రస్తుతం హైదరాబాద్ 302 రన్స్ లీడ్‌లో కొనసాగుతున్నది.