
సిద్దిపేట రూరల్, వెలుగు : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును సిద్దిపేట రూరల్ మండలంలోని సర్పంచులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏడోసారి ఎమ్మెల్యే గా గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు తన గెలుపునకు కృషి చేసిన సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.