
గజ్వేల్, వెలుగు: మజీ సీఎం కేసీఆర్హయాంలోనే కురుమలు అభివృద్ధి సాధించారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్టణంలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లిలో జరుగుతున్న బీరప్ప జాతరలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కుర్మసంఘం అధ్యక్షుడు నగేశ్, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మ న్ రాజమౌళి, కౌన్సిలర్ రజిత , హైకోర్టు అడ్వకేట్ రాజు, నాగయ్య , కనకయ్య, కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు స్వామి, మాజీ సర్పంచ్ అయ్యలం పాల్గొన్నారు.