- ఆసియా అండర్-15 బ్యాడ్మింటన్ టైటిల్ సొంతం
న్యూఢిల్లీ: ఇండియా యంగ్ షట్లర్ తన్వీ పత్రి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. అద్భుత ఆటతో సత్తా చాటిన టాప్ సీడ్ తన్వీ అండర్–15 గర్ల్స్ సింగిల్స్‌లో టైటిల్ గెలిచింది. చైనాలోని చెంగ్డూలో ఆదివారం జరిగిన ఫైనల్లో 13 ఏండ్ల ఇండియా అమ్మాయి 22–20, 21–11తో రెండో సీడ్ తి తు హుయెన్ ఎన్‌గుయెన్ (వియత్నాం)పై వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. దాంతో, ఈ మెగా టోర్నీలో అండర్–15 టైటిల్ గెలిచిన ఇండియా మూడో షట్లర్‌గా నిలిచింది.
2017లో హైదరాబాదీ సామియా ఇమాద్ ఫరూఖీ, 2019లో తస్నిమ్ మిర్ ఈ ఘనత సాధించారు. ఈ టోర్నీలో ఆరంభం నుంచి చివరి వరకూ తన్వీ సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. ఫైనల్ సహా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు. తుది పోరులో వియత్నాం షట్లర్ నుంచి ఎదురైన సవాల్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టింది. తొలి గేమ్‌లో ఓ దశలో 11–17తో వెనుకంజలో నిలిచినా గొప్పగా పుంజుకున్న తన్వీ.. రెండో గేమ్‌లో ప్రత్యర్థికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా విజేతగా నిలిచింది. కాగా, అండర్–17 బాయ్స్‌లో తెలంగాణ కుర్రాడు జ్ఞానదత్తు కాంస్యం నెగ్గగా.. ఈ టోర్నీని ఇండియా రెండు మెడల్స్‌తో ముగించింది.