ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ లో జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా పాకిస్థాన్ కు వెళ్తుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బీసీసీఐ భారత క్రికెట్ జట్టును పాక్ కు పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ దేశానికి ఖచ్చితంగా వచ్చి ఆడాల్సిందేనని పట్టు పడుతుంది. పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు సైతం ఇప్పటికే టీమిండియా పాకిస్థాన్ కు రావాలని కోరిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ పాకిస్థాన్ పేసర్ తన్వీర్ అహ్మద్ పాకిస్థాన్ కు రావడానికి భారత్ భయపడకూడదని చెప్పాడు.
"షేర్ హై హమ్ లోగ్ షేర్ హై, హమ్ లోగ్ షేర్ హై. హమ్ లోగ్ తేరే ముల్క్ మే ఆ కే ఖేల్ కే గయే హై. ఆకే దిఖా....హమ్ తో కహ్ రహే హై ఆకే ఖేలో. సెక్యూరిటీ దేంగే, సబ్ కుచ్ దేంగే తుమ్ లోగోన్ కో. ఆ toh sahi ek dafaa" (మేము సింహాలు. మేము వచ్చి మీ దేశంలో క్రికెట్ ఆడాము. మేము మీకు భద్రత కల్పిస్తాము. ఒకసారి మా దేశంలోకి అడుగు పెట్టండి). భారత్ లో పాకిస్థాన్ ఎలా ఆడిందనేది ముఖ్యం కాదు. పాకిస్తాన్ భారత్ లో ఆడడానికి నిరాకరించలేదు". అని తన్వీర్ అన్నాడు.
2008 ఆసియా కప్ తర్వాత భారత్ క్రికెట్ సిరీస్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లలేదు. భారత్ పాకిస్థాన్ కు వెళ్తుందా లేదా అనే విషయంపై త్వరలో బీసీసీఐ ఐసీసీతో చర్చించనుంది. భారత్ పాకిస్థాన్ కు వెళ్లకపోతే హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు జరుగుతాయి. దీని ప్రకారం భారత్ మ్యాచ్ లు శ్రీలంక లేదా దుబాయ్‌లో జరుగుతాయి. 2023 ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగితే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించారు.
ALSO READ : The Hundred: 600 వికెట్ల క్లబ్‌లో రషీద్ ఖాన్.. అరుదైన జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్
పాక్ వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు చేయనప్పటికీ.. ప్రతిపాదిత షెడ్యూల్ మాత్రం రిలీజ్ చేశారు. దీని ప్రకారం గ్రూప్ ఏ లో పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్,న్యూజిలాండ్.. గ్రూప్ బి లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ మెగా టోర్నీ ఆడతాయి. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌ను మూడు వేదికల్లో నిర్వహించాలని భావిస్తున్నారు. వీటిలో కరాచీ, రావల్పిండి, లాహోర్ ఉన్నాయి.
Tanvir Ahmed Angry Reply😡 To Harbhanjan Singh @ImTanveerA @harbhajan_singh #ChampionsTrophy #Pakistan #Today pic.twitter.com/dWsnVCnMOW
— Suhaib (@Suhaibjutt1016) July 28, 2024