టాంజానియా యువతికి 12 ఏండ్ల జైలుశిక్ష

ఎల్ బీనగర్,వెలుగు: డ్రగ్స్ కేసులో ఓ విదేశీ యువతికి రంగారెడ్డి జిల్లా కోర్టు 12 ఏండ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. టాంజానియాకు చెందిన ఓ యువతి 21, జూన్ 2021న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో లాగేజీ బ్యాగ్ తో దిగింది. 

ఆమెను డీఆర్ఐ టీమ్ చెక్ చేయగా బ్యాగ్ లో రూ.19.37 కోట్ల విలువైన రూ. 2,980 గ్రాముల హెరాయిన్ దొరికింది. ఆమెను అరెస్ట్ చేసి  ఎన్డీపీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.  హెరాయిన్ డ్రగ్ సీజ్ చేసి రంగారెడ్డి జిల్లా కోర్టులో రిమాండ్ చేశారు. విచారణలో భాగంగా పూర్తి ఆధారాలు డీఆర్ఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. పరిశీలించిన కోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది.