టీ20 వరల్డ్ కప్ 2024 లో బంగ్లాదేశ్ సూపర్ 8 కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. భారత కాలమాన ప్రకారం సోమవారం (జూన్ 17) . నేపాల్ పై జరిగిన మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పేసర్ తంజీమ్ హసన్ సకీబ్ సంచలన బౌలింగ్ తో అదరగొట్టాడు. నాలుగు ఓవర్ల స్పెల్ వేసి కేవలం 7 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే తన బౌలింగ్ తో బంగ్లాకు గెలుపు అందించినా.. తన వ్యక్తిత్వంతో విమర్శలు మూటకట్టుకున్నాడు.
స్వల్ప లక్ష్య ఛేదనలో నేపాల్ ఇన్నింగ్స్ ఆరభించింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో తంజీమ్ వేసిన బాల్‌ను రోహిత్ పౌడేల్ షాట్స్ ఆడుతున్నాడు. ఈ సమయంలో తంజీమ్ సహనం కోల్పోయి.. అతన్ని రెచ్చగొట్టాడు. రోహిత్ పౌడేల్ కూడా దీటుగా స్పందించడంతో తంజీమ్ మరింతగా రెచ్చిపోయాడు. దీంతో ఒక్కసారిగా గ్రౌండ్‌లో వాతావరణం వేడెక్కింది. మ్యాచ్ తర్వాత ఈ ఘటనపై విచారణ జరిగిన ఐసీసీ తంజీమ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమాన విధించింది. ఆర్టికల్ 2.12 ప్రకారం దీనిని నేరంగా పరిగణిస్తారు.
బంగ్లాదేశ్ సూపర్ 8 లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో తలపడాల్సి ఉంది. జూన్ 21 న ఆస్ట్రేలియాతో.. జూన్ 22 న భారత్ తో.. జూన్ 25 న ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లు ఉన్నాయి. గ్రూప్ దశలో సౌతాఫ్రికాపై ఓడిపోయిన బంగ్లాదేశ్.. నేపాల్, నెదర్లాండ్స్, శ్రీలంకపై విజయాలు సాధించింది.
Tanzim Hasan Sakib of Bangladesh fined by ICC for code of conduct breach. pic.twitter.com/Ekhu3nrzLB
— CricketGully (@thecricketgully) June 19, 2024