బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతుంది. ఇందులో భాగంగా మంగళవారం (డిసెంబర్ 11) జరిగిన రెండో వన్డేలో ఒక వివాదాస్పద సంఘటన జరిగింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ టాంజిమ్ హసన్ సాకిబ్ అత్యుత్సాహం వివాదానికి దారి తీస్తుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ ఆరో ఓవర్ లో హసన్ సాకిబ్ ఇన్ స్వింగ్ డెలివరీ వేశాడు. ఈ బంతిని బ్రాండన్ కింగ్ డిఫెన్స్ ఆడాడు. బంతి సాకిబ్ చేతుల్లోకి వెళ్ళింది.
ఈ సమయంలో బంగ్లా ఫాస్ట్ బౌలర్ తన దూకుడును చూపించాడు. బ్యాటర్ క్రీజ్ లో ఉండగానే బంతిని బలంగా అతని వైపు విసిరాడు. బంతి కాళ్ళ వైపు రావడంతో బ్యాట్ తో అడ్డుకున్నాడు. దీంతో అబ్ స్ట్రకింగ్ ఫీల్డ్ కింద అంపైర్ కు అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ అతని పనికిమాలిన అప్పీల్ ను పట్టించుకోలేదు. సాకిబ్ చేసిన పని కింగ్ కు నచ్చలేదు. దీంతో అతని వైపు కోపంగా కోపంగా చూశాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి వార్ జరిగినా గొడవ పెద్దది కాలేదు.
What are they appealing for? 👀
— FanCode (@FanCode) December 11, 2024
Brandon King was not impressed with Tanzim Hasan Sakib’s antics after that delivery! 😤#WIvsBANonFanCode pic.twitter.com/92K5AUgbWo
ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో వన్డేలో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన వెస్టిండీస్.. బంగ్లాను 227 పరుగులకు ఆలౌట్ చేసింది. సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 36.5 ఓవర్లలో టార్గెట్ ఫినిష్ చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 76 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 82 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను వెస్టిండీస్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో గెలుచుకుంది.