ఈ జన్మకి నీతోనే.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్

ఈ జన్మకి నీతోనే.. అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్

నందమూరి తారకరత్న మరణాన్ని తన భార్య అలేఖ్య రెడ్డి ఇప్పటికి జీర్ణించుకోలేకపోతోంది. టాలీవుడ్ హీరో గా,తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నందమూరి తారకరత్న తెలుగు ప్రజలందరికీ దగ్గరయ్యారు. ఇక గత కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న ఆయన రాజకీయాల్లో రాణిస్తారు అనుకుంటే ఊహించని విధంగా ఆయన మరణించారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో కార్డియాక్ అరెస్ట్ కు గురైనా తారకరత్న..  దాదాపు నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచాడు.

ఇక అప్పటినుండి అలేఖ్య రెడ్డి..  వారి ప్రేమ వివాహం, వారి మధ్య ఉన్న అనుబంధం గురించి పలు ఎమోషనల్ పోస్టులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంది. ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా మరో ఎమోషనల్ పోస్ట్ చేసిన అలేఖ్య తన భర్త తారకరత్నతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ.. "ఈ జీవితానికి ఇక నువ్వు నేను మాత్రమే.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలని ఇచ్చి వెళ్లావు. వాటితో నేను ముందుకు వెళ్తాను. నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.  

మరొక పోస్టులో భర్త తారకరత్న చిన్ననాటి ఫోటోలు, తన కుమారుడి ఫోటోలు షేర్ చేసిన ఆమె..   వీళ్ళే తన స్టార్స్ అంటూ పేర్కొంది. ఇవన్నీ చూస్తుంటే.. అలేఖ్య తన భర్త మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతుంది అనేది అర్థమవుతోంది. అయితే.. ఆమెను తారకరత్న మృతి బాధ నుంచి బయటకు తీసుకురావాలని, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా చేయాలని, తారకరత్న ఆశయం అలేఖ్యా రెడ్డి ద్వారా నెరవేర్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి అలేఖ్య రెడ్డి ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుటుందో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.