తెలంగాణ సమాజం కేసీఆర్ పతనం కోరుకుంటోంది

తెలంగాణ సమాజం కేసీఆర్ పతనం కోరుకుంటోంది

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ అవినీతి బయటపడుతుందన్న భయంతోనే బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. ఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయిన ఆయన.. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ సమాజం కేసీఆర్ పతనాన్ని కోరుకుంటోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని తరుణ్ చుగ్ విమర్శించారు. అవినీతి చేయడమే టార్గెట్గా ముందుకెళ్తున్న కేసీఆర్కు ప్రజల సొమ్ము దోచుకోవడం మాత్రమే తెలుసని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ ఎన్నో ఉద్యమాలు చేసిందన్న తరుణ్ చుగ్.. ఇప్పుడు కేసీఆర్ కుట్రలపై పోరాడుతుందని చెప్పారు. బీజేపీ చేస్తున్న పోరాటాలతో సీఎం కాళ్ల కింద భూమి కదిలిందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చుగ్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాలు మారుస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయనకు కూటమి ఏర్పాటు చేసే స్థాయి లేదని శివసేన నేతలు అంటున్నారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తల కోసం..

మల్లన్న సాగర్ రిజర్వాయర్ పూర్తి వివరాలు

హిమపాతంతో కశ్మీర్ ప్రజల తీవ్ర ఇబ్బందులు