బండి పాదయాత్రలో తరుణ్ చుగ్, వివేక్ వెంకటస్వామి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర 10వ రోజు కొనసాగుతోంది. రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తున్న ఆయనను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో పాటు పలు నేతలు కలుసుకున్నారు. బండి సంజయ్ తో కలిసి కొంతదూరం పాదయాత్రలో పాల్గొన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈటల నేతృత్వంలోని చేరికల కమిటీతో చుగ్ భేటీయై ఈ నెల 21న పార్టీలో చేరే నాయకుల లిస్టు ఫైనల్ చేయనున్నారు. అనంతరం టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాల కమిటీ సమావేశం కానున్నారు. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై నేతలు వ్యూహాలు సిద్ధం చేయనున్నారు.