ఖైరతాబాద్, వెలుగు: లండన్‌లో జరగనున్న మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి పోటీ చేయనున్నారు. బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ జాతీయ నేతలు కరుణ గోపాల్, అంకెం హరితో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను పుట్టింది ఢిల్లీలోనైనా పెరిగిందంతా లండన్ లోనేనని తరుణ్ వెల్లడించారు.
లండన్‌లో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా 2024 లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాను మేయర్‌గా విజయం సాధిస్తే.. భద్రతతో పాటు సంస్కృతిని పెంపొందించేలా కార్యాచరణ అమలు పరుస్తానని హామీ ఇచ్చారు. యూకేలో 18 లక్షల భారతీయులు ఉన్నారని, అందరి సహకారంతో తాను విజయ పథం వైపు అడుగులు వేస్తానని తరుణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.