తెలంగాణలో లైంగిక వేధింపులకు గురైన 18 సంవత్సరాల లోపు బాలికల కోసం తరుణి స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ చైతన్య పురి లో ఏర్పాటు చేసిన “తరుణి స్వాలంబన” పునరావాస& నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని రెడ్డీస్ లేబరేటరీస్ CEO ప్రారంభించారు.
తరుణి స్వచ్ఛంద సంస్థ 24 సంవత్సరాలుగా బాలికల కోసం అనేక కార్యక్రమాలు చేస్తోందని,బాల్యవివాహాలు ,బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులు మొదలైన సామాజిక అంశాలపై తరుణి సంస్థ అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిందన్నారు. తరుణి సంస్థ భరోసా కేంద్రాలను తెలంగాణ పోలీస్ లతో కలిసి భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి నడిపిస్తున్నారని తెలిపారు.
లైంగిక వేధింపులకు గురైన బాలికలకు పునరావస కేంద్రాలు తెలంగాణలో లేవని అందుకే మొట్టమొదటిసారిగా ఇటువంటి కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసామని తరుణి సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఈ కేంద్రంలో 50 మందికి ఇక్కడ పునరావాసం కల్పించడానికి వీలు ఉందని, దీనితోపాటుగా వారి జీవితంలో నిలదొక్కుకోవడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన గర్భిణీ బాలికలకు తమ హాస్పిటల్లో ఉచితంగా డెలివరీ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు.