బెల్ట్​, వైన్స్​షాపులపై టాస్క్​ఫోర్స్​ దాడులు

నెక్కొండ, వెలుగు : బెల్ట్, వైన్స్​షాపులపై టాస్క్​ఫొర్స్, ఎక్సైజ్​పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. వరంగల్​ జిల్లా నెక్కొండ మండలంలోని చిన్నకోర్పోల్, పెద్దకోర్పోల్, అలంకానిపేట, రెడ్లవాడ, పనికర గ్రామాల్లోని కిరాణం షాపుల్లో మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వరంగల్​ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి రూ.46వేల290 విలువ చేసే మద్యం బాటిల్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

10 మంది బెల్ట్​షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. నెక్కొండలో అనుమతులు లేకుండా సిట్టింగ్, రికార్డులు మేయిటెంనెన్స్ చేయకపోవడంతో రెండువైన్స్​ షాపులపై కేసులు నమోదు చేసి, ఒక షాపు రూ.25వేలు ఫైన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరైడ్స్​లో ఎస్సై మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.