ఇసుక అక్రమ నిల్వలపై టాస్క్‎ఫోర్స్ మెరుపు దాడి.. 1,098 టన్నుల ఇసుక సీజ్

ఇసుక అక్రమ నిల్వలపై టాస్క్‎ఫోర్స్ మెరుపు దాడి.. 1,098 టన్నుల ఇసుక సీజ్

పద్మారావు నగర్, వెలుగు: సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా డంప్ చేసిన ఇసుకను టాస్క్​ఫోర్స్​పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1,098 టన్నుల ఇసుక సీజ్ చేశారు. నార్త్ జోన్ పరిధిలోని తుకారాంగేట్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, బేగంపేట, సికింద్రాబాద్ అక్రమంగా డంప్​చేసిన 889 టన్నులు, వెస్ట్ జోన్ పరిధిలోని జానకమ్మ తోట, యూసుఫ్ గూడలో 143 టన్నులు, సెంట్రల్ జోన్‎లోని ముషీరాబాద్, గాంధీనగర్, దోమల గూడలో డంప్​చేసిన 66 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నామని నార్త్​జోన్ టాస్క్​ఫోర్స్​డీసీపీ సుధీంద్ర వెల్లడించారు. కొంతమంది అక్రమార్కులు బయట నుంచి ఇసుక తెచ్చి సిటీలోని పలుచోట్ల నిల్వ చేస్తున్నారని, రూ.10 వేల విలువ చేసే లారీ ఇసుక లోడును రూ.50 వేలకు విక్రయిస్తున్నారని చెప్పారు. సిటీ రోడ్లపై నిఘా పెంచుతామని తెలిపారు. ------------