ఎల్కతుర్తి, వెలుగు: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా ఎల్కతుర్తి మండలంలోని బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆరెపల్లిలో బుధవారం రాత్రి బెల్ట్ షాపులో తనిఖీలు చేసి రూ.10,800 విలువ చేసే మద్యాన్ని పట్టుకొని, షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.
గురువారం దామెరలోని బెల్ట్ షాపులపై దాడులు చేసి 30వేల మద్యాన్ని పట్టుకొని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కేశ వాపూర్లో షాపుల్లో రూ.25వేల మద్యాన్ని పట్టుకున్నారు. గోపాల్పూర్లో రూ.4వేల మద్యాన్ని పట్టుకొని నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. దాడుల్లో ఎస్సై గోదారి రాజుకుమార్,టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు.