భద్రాచలం, వెలుగు: పట్టణంలోని గోదావరి కరకట్ట ప్రాంతంలో 13కిలోల గంజాయి చేతులు మారుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు, పట్టణ పోలీసులు కలిసి మంగళవారం పట్టుకున్నారు. అనంతరం సీఐ నాగరాజురెడ్డి వివరాలను వెల్లడించారు. ఒడిశాలోని మల్కనగిరికి చెందిన సంతోష్‌కుమార్, మంగళ ఆంధ్రా–-ఒడిశా సరిహద్దుల్లోని సీలేరు నుంచి తెచ్చి హైదరాబాద్‌కు చెందిన అర్జున్‌సింగ్, అతడి భార్య నందినికి అప్పగించారు. ఇదే సమయంలో టాస్క్ ఫోర్స్ ఎస్సైలు బెల్లంకొండ సత్యనారాయణ, తిరుపతితోపాటు భద్రాచలం ఎస్సై శ్రీకాంత్, పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారన్నారు. దీని విలువ రూ.2.60లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
సినీ ఫక్కీలో 25 కేజీలు
ఇల్లెందు: సినీ ఫక్కీలో కారులో 25కిలోల గం జాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందినవారిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్, ఇల్లెందు ఎక్సైజ్ఆఫీసర్లు మంగళవారం పట్టుకున్నారు. బొజ్జాయి గూడెం సమ్మక్క-సారక్క గద్దెల వద్ద వాహన తనిఖీల్లో ఒడిశాకు చెందిన కారును పరిశీలించారు. 25కిలోల గంజాయిని గుర్తించినట్లు ఆఫీసర్లు తెలిపారు. నిందితులు సినీ ఫక్కీలో కారు అడుగు భాగంలో గంజాయి ఉంచార న్నారు. తనిఖీల్లో ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ సర్వేశ్వరరావు, ఇల్లందు ఎక్సైజ్సీ సీఐ రాజశేఖర్ ఉన్నారు.