- రూ.3.26 లక్షల నగదు, ఐదు కార్లు, 6 బైక్‌లు సీజ్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా నవాబుపేట పీఎస్ పరిధిలోని గంగ్యాడలో 20 మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. గ్రామ శివారులోని మాజీ సర్పంచ్ మల్లేశం ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం దాడి చేశారు. 20 మందిని అరెస్ట్ చేసి, రూ.3.26 లక్షల నగదు, 22 సెల్ ఫోన్‌లు, ఐదు కార్లు, 6 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే బషీరాబాద్ మండలంలోని నవాల్గ గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.55 వేల నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలపై ఆయా పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. జిల్లాలో ఎక్కడ పేకాట ఆడిన, ఇసుక, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన 8712670022 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.