ఇవెక్కడి గలీజు డ్యాన్సులు.. హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో..

ఇవెక్కడి గలీజు డ్యాన్సులు.. హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో..

హైదరాబాద్: పాతబస్తీ బండ్లగూడలో ముజ్రా పార్టీని టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. నలుగురు ట్రాన్స్‌జెండర్లతో పాటు 8 మంది యువకులు.. మొత్తం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ గౌస్‌నగర్‌లోని లేక్‌వ్యూ హిల్స్‌లో కాంపౌండ్‌ వాల్‌ ఉన్న ఒక ఫ్లాట్‌లో గుట్టు చప్పుడు కాకుండా ముజ్రా పార్టీ నడిచింది. అయితే ఈ పార్టీ గురించి పక్కా సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు.

ALSO READ | హాస్పిటల్ ముందు పార్క్ చేసిన బైక్‌లను వేషాలు మార్చి కొట్టేసే ముఠా అరెస్ట్

బండ్లగూడలోని లేక్ వ్యూ హిల్స్ గౌస్ నగర్‌లో కాంపౌండ్ వాల్ ఉన్న ప్లాట్‌లో ఆర్గనైజ్డ్ ముజ్రా పార్టీ జరుగుతుందని గుర్తించారు. నలుగురు ట్రాన్స్జెండర్లతో కలిసి 8 మంది యువకులు అశ్లీల నృత్యాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ట్రాన్స్‌జెండర్లు అసభ్యకరమైన వస్త్రధారణలో ఉండి యువకులతో కలిసి చిందులేశారు. పెద్ద పెద్దగా కేకలేస్తూ.. పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఒక యాంప్లిఫైయర్ను, ఒక లౌడ్ స్పీకర్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు.