వరంగల్ లో టాస్క్ ఫోర్స్ దాడులు.. ఓ ఇంట్లో ఉంచిన నకిలీ విత్తనాలు సీజ్

వరంగల్: సంగెం మండలంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఊకుమ్మడి తనిఖీలు చేపట్టారు. ఓ ఇంట్లో నిల్వ ఉంచి నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నకిలీ విత్తనాల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని తెలిపారు. దీంతో లక్షా పదివేల రూపాయల విలువైన 122 లీటర్ల నిషేధిత గడ్డి మందును కూడా పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. 

సంగెం మండలం తిమ్మపూర్ కు చెందిన మెంతుల రాజేష్, వరంగల్ జిల్లాకు చెందని కోడూరు శ్రీనివాసరావులు నకిలీ విత్తనాలు వ్యాపారం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనికీల్లో నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. రాజేష్, కోడూరు శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి పరారీలో ఉన్నారు.