కోడి పందేలు ఆడుతున్న15 మంది అరెస్టు

కోడి పందేలు ఆడుతున్న15 మంది అరెస్టు

కాగజ్ నగర్, వెలుగు: కోళ్ల పందేల స్థావరంపై బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడిచేసి  15 మందిని పట్టుకున్నారు.  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌‌‌‌‌‌‌‌ మండలం సలుగుపల్లి గ్రామ శివారులో కోడి పందేలు ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సందీప్ కుమార్ బృందం దాడి చేసింది.  ఈ దాడుల్లో కోడి పందేల నిర్వాహకులు, కోడి పందేలు ఆడుతున్న మొత్తం 15 మందిని అదుపులోకి  తీసుకున్నారు.  

పందెం రాయుళ్ల నుంచి 41 వేల 740 రూపాయల  నగదు,  నాలుగు పందెం కోళ్లు,  11  మొబైల్స్,  పది కోడి కత్తులు, అయిదు బైకులు స్వాధీనం చేసుకున్నారు.  వీటిని బెజ్జూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో అప్పగించినట్లు టాస్క్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ సీఐ రాణాప్రతాప్ , ఎస్ఐ సందీప్ తెలిపారు.  కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ మధు, రమేశ్‌‌‌‌‌‌‌‌, సంజీవ్‌‌‌‌‌‌‌‌, స్పెషల్‌‌‌‌‌‌‌‌ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.