ఉద్యోగాల పేరుతో ట్రాప్.. ప్రతీ వీకెండ్ డ్యాన్స్ లు చెయ్యాలి..ఇది టాస్ పబ్ నిర్వాకం

ఉద్యోగాల పేరుతో  ట్రాప్.. ప్రతీ వీకెండ్ డ్యాన్స్ లు చెయ్యాలి..ఇది టాస్ పబ్ నిర్వాకం

టాస్ పబ్ ను సీజ్ చేస్తామన్నారు బంజారాహిల్స్  ఏసీపీ వెంకట్ రెడ్డి.  టాస్ పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ టీమ్ తో కలిసి రైడ్ చేశామని చెప్పారు. టాస్ పబ్ లో అశ్లీల డ్యాన్సులు చేస్తున్న యువతులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.  

ఉద్యోగాల పేరుతో పబ్ యాజమాన్యం యువతులను ట్రాప్ చేసిందని తెలిపారు ఏసీపీ వెంకట్ రెడ్డి.  ప్రతీ వీక్ ఎండ్ లో పబ్ కి రావాలని యాజమాన్యం యువతులకు సూచించిందన్నారు. కస్టమర్లతో చనువుగా ఉంటూ.. బిల్ ఎక్కువ చేయించడం యువతుల టార్గెట్  అని చెప్పారు ఏసీపీ.. కస్టమర్ తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమీషన్ ఇస్తారని వెల్లడించారు. మొత్తం 42 మంది యువతులు, 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు.  ఇందులో 10 మంది యువతులు గతంలో ఊర్వశి బార్, ఆఫ్టర్ 9 పబ్ లో పట్టుబడిన వాళ్ళు గా గుర్తించామని చెప్పారు. 

ALSO READ | శరత్​ సిటీ మాల్​రెస్టారెంట్లలో ఫుడ్​ సేఫ్టీఆఫీసర్ల తనిఖీలు

 రిపీటెడ్ గా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు యువతులపై కఠిన  చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏసీపీ వెంకట్ రెడ్డి. పబ్ ను సీజ్ చేసి ఎక్సైజ్ అధికారులకు కూడా రిపోర్ట్ పంపిస్తామన్నారు ఏసీపీ.  పబ్ నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, ఆరిఫ్, శ్రావణ్ గౌడ్, డీజే ప్లేయర్ ఆసిఫ్ లపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.