ఏన్కూరులో 500 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఏన్కూరులో 500 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
  • రెండు లారీలను సీజ్ చేసిన పోలీసులు

వైరా, వెలుగు:  రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 12 లక్షల విలువ చేసే 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం పట్టుకున్నారు.  పోలీసుల వివరాల ప్రకారం.. ఏన్కూరు ప్రాంతం నుంచి ఒక లారీ, తల్లాడ వైపు నుంచి మరో లారీ అక్రమ రేషన్ బియ్యంతో వస్తున్న సమాచారం టాస్క్  ఫోర్స్ పోలీసులకు అందింది. 

 కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామ సమీపంలో ఓ దాబా హోటల్ దగ్గర బియ్యంతో ఉన్న రెండు లారీలను టాస్క్ ఫోర్స్ పోలీసులు, సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసి కేసు నమోదు చేశారు.  దాడుల్లో టాస్క్ ఫోర్స్ డీఎస్‌పీ అంజయ్య యాదవ్, సీఐ వసంత్ కుమార్, సివిల్ సప్లై అధికారులు సాయికిరణ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.