- ఎయిర్‌పాడ్స్, యూఎస్బీ కేబుల్స్, ఇతర వస్తువుల స్వాధీనం
- విలువ 2.42 కోట్లు..నలుగురు అరెస్ట్
బషీర్ బాగ్, వెలుగు: అబిడ్స్ లోని జగదీశ్మార్కెట్లో భారీ మొత్తంలో నకిలీ యాపిల్ప్రొడక్ట్స్ పట్టుబడ్డాయి. టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. జగదీశ్మార్కెట్లోని షాపుల్లో నకిలీ యాపిల్ప్రొడక్ట్స్అమ్ముతున్నారని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌పోలీసులు శుక్రవారం రైడ్చేశారు. టార్గెట్ మొబైల్ షాప్ నిర్వాహకుడు నింబ్ సింగ్, పటేల్ మొబైల్ షాప్ ఓనర్ హీరారామ్, ఔషపురా మొబైల్ షాప్ నిర్వాహకుడు గోవిందాల్ చౌహాన్, నంది మొబైల్స్ నిర్వాహకుడు ముకేశ్జైన్ను అదుపులోకి తీసుకున్నారు.
నాలుగు షాపుల్లో పెద్ద మొత్తంలో నకిలీ యాపిల్ ప్రొడెక్ట్స్ గుర్తించారు. రూ.2కోట్ల42లక్షల55వేల900 విలువ చేసే 579 ఎయిర్ పాడ్స్ , 351 యుఎస్బీ అడాప్టర్స్, 747 యుఎస్బీ పవర్ కేబుల్స్, 62 బ్యాటరీలు, 17 పవర్ బ్యాంకులు, 1,401 బ్యాక్ పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నలుగురిని అబిడ్స్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు.