మందమర్రిలో 150 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ​పట్టివేత

కోల్​బెల్ట్, వెలుగు: జగిత్యాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాళ్ల పీడీఎస్ రైస్​ను రామగుండం టాస్క్​ఫోర్స్​పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో టాస్క్​ఫోర్స్​ఇన్​స్పెక్టర్ ​సంజయ్, ఎస్ఐ ఉపేందర్ ​నేతృత్వంలో పోలీసులు మందమర్రిలోని నేషనల్​హైవే టోల్​గేట్​వద్ద తనిఖీలు చేపట్టారు. 150 క్వింటాళ్ల పీడీఎస్​ రైస్​ను తరలిస్తున్న ఐచర్​ వ్యాన్​ను గుర్తించి పట్టుకున్నారు.

 డ్రైవర్​మహుమూద్​అలీని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న బియ్యం విలువ రూ.4.5లక్షలు ఉంటుందని తెలిపారు. అసిఫాబాద్ ​జిల్లా వాంకిడికి చెందిన షంశీర్ ​ఖాన్ ​అనే వ్యక్తి జగిత్యాల జిల్లాలో తక్కువ ధరకు బియ్యాన్ని కొని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.  వాహనంతోపాటు, డ్రైవర్​ను మందమర్రి పోలీసులకు అప్పగించారు.