మేడ్చల్ జిల్లా తూంకుంటలో గంజాయి చాక్లెట్లు పట్టుబడడం కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు బీహార్ కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో 85 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు .
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బీహార్ దర్భంగ ప్రాంతానికి చెందిన ఉపేందర్ మండల్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం తూంకుంటకు వచ్చాడు. తూంకుంటలో ఒక పాన్ షాప్ ఓపెన్ చేసి పాన్ మాసాలతో పాటు గంజాయి చాక్లెట్ల అమ్మకాలు సాగిస్తుస్తున్నాడు. పక్కా సమాచారంతో డీటీఎఫ్ ఎస్సై పవన్‌కుమార్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు సత్తార్, వెంకటేశ్వర్‌రావు, కానిస్టేబుళ్లు సంజయ్, మునాఫ్ లు కలిసి ఉపేందర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. తూంకుంటలో అద్దెకు ఉంటున్న ఉపేందర్ ఇంట్లో తనిఖీలు చేయగా 85 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లు దొరికాయి.
ALSO READ | పగలంతా HR పని.. రాత్రుల్లో అమ్మాయిల వేట.. 700 మందిని ఏం చేశాడంటే..!
ఈ గంజాయి చాక్లెట్లను బీహార్‌ను తీసుకొచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. 40 చాక్లెట్ల ప్యాకెట్ ను బీహార్‌లో రూ. 25 తీసుకొచ్చి తూంకుంటలో ఒక్కొక్క చాక్లెట్ ను రూ.10 చొప్పున అమ్ముతున్నాడు. చాక్లెట్లను నిందితుడిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్‌లకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గంజాయి చాక్లెట్లను పట్టుకున్న డీటీఎఫ్ టీమ్‌ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.