రేషన్​ బియ్యం పట్టివేత

రేషన్​ బియ్యం పట్టివేత

నెక్కొండ/ పరకాల, వెలుగు: టాస్క్​ఫోర్స్ పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్​ బియ్యాన్ని పట్టుకున్నారు. టాస్క్​ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ కథనం ప్రకారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రావన్​కుమార్ బిన్నీ రైస్ మిల్లులో పీడీఎస్​ బియ్యం రీసైక్లింగ్ జరుగుతుందనే  పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేశారు. 325క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం, 187.5 క్వింటాళ్ల బ్రోకెన్​ రైస్ లభించాయని తెలిపారు. ఈ మేరకు మిల్లు ఓనర్​ రామిని శివపై కేసు నమోదు చేసి బియ్యాన్ని పరకాల పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. 

ఈ తనిఖీల్లో టాస్క్​ఫోర్స్​ సీఐ రంజిత్,​ పరకాల ఎస్సై రమేష్​తోపాటు టాస్క్​ఫోర్స్​, పరకాల పోలీసు సిబ్బంది ఉన్నారు. వరంగల్​జిల్లా నెక్కొండ మండలం అప్పల్​రావుపేటలోని గోనె ఆనంద్​ రైస్​మిల్లులో బియ్యం నిల్వ చేశారనే సమాచారం మేరకు టాస్క్​ఫోర్స్, సివిల్​పోలీసులు రైడ్​చేశారు. రూ.52వేల విలువ చేసే 20క్వింటాళ్ల రేషన్​బియ్యాన్ని స్వాధీనపరుచుకుని గోనె ఆనంద్​తో పాటు మిల్లుకు పీడీఏస్ బియ్యాన్ని తరలిస్తున్న రామన్నకుంటతండాకు చెందిన ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.