వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టాస్క్ ఫోర్స్ దాడులు

  • రూ. 5 లక్షలు జరిమానా 

పాల్వంచ, వెలుగు: టౌన్​లోని వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై సోమవారం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తు న్నారనే సమాచారం మేరకు  ఐదుగురు అధికారులు పట్టణంలోని కిన్నెరసాని రోడ్డు లోని  మద్యం దుకాణంలో తనిఖీ నిర్వహించారు.  అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి రూ .5 లక్షలు జరిమానా విధించారు.  దీంతో పాటు స్థానిక కరకవాగులో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తికి రూ. 20 వేలు ఫైన్ వేశారు.