రెండున్నర టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత

రెండున్నర టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత

బోధన్, వెలుగు: గోదాంలో అక్రమంగా నిల్వఉంచిన పీడీఎస్ బియ్యాన్ని గురువారం పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనీసానగర్ లోని ఓ గోదాంపై టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ ఆధ్వర్యంలో దాడి చేసి 2.5 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టకున్నట్లు తెలిపారు. పట్టుకున్న బియ్యం విలువ సుమారు రూ.80వేలు ఉంటుందన్నారు. గోదాం యజమానిని అరెస్ట్ చేసి  బోధన్ పోలీస్ స్టేషన్ లో  అప్పగించినట్లు తెలిపారు.