కొండాపూర్​లో డీజే కొడుతడు.. డ్రగ్స్​ అమ్ముతడు

కొండాపూర్​లో డీజే కొడుతడు.. డ్రగ్స్​ అమ్ముతడు
  • కొండాపూర్​లో డీజే ప్లేయర్​ అరెస్ట్​
  • 6.7 గ్రాముల ఎండీఎంఏ​ సీజ్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: కొండాపూర్ ఆర్టీఓ ఆఫీసు ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్న డీజే ప్లేయర్ ను టాస్క్​ఫోర్స్​టీమ్​పట్టుకుని 6.7 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేసింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన సుజిత్​బెంగళూరులో చదువుకునే టైంలో డ్రగ్స్‌‌‌‌కు అలవాటు పడ్డాడు. హైదరాబాద్‌‌‌‌కు వచ్చి పబ్బుల్లో డీజే ప్లేయర్​గా పని చేస్తున్నాడు. సంపాదన సరిపోక బెంగళూరులో గ్రాము ఎండీఎంఏను రూ.2 వేలకు కొని, సిటీలో అమ్ముతున్నాడు. ఇక్కడ ఒక్కో గ్రామును రూ.5 వేలకు విక్రయిస్తున్నాడు. 

సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్- డీ టీమ్‌‌‌‌ సుజిత్​ను అదుపులోకి తీసుకుంది. అతని నుంచి 6.7 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్​ఫోర్స్​సీఐ నాగరాజు తెలిపారు. హోలీ వస్తుండడంతో నాలుగు రోజుల కింద బెంగళూరు నుంచి10 గ్రాములు తీసుకువచ్చాడని, కొద్దిగా అమ్మి మిగిలిన ఎండీఎంఏను ఇంట్లో పెట్టుకున్నాడన్నారు. సుజిత్‌‌‌‌ను శేరిలింగంపల్లి ఎక్సైజ్‌‌‌‌ పోలీసులకు అప్పగించారు.