హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా ఫుడ్ సేప్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ హోటల్లు నిబందనలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ బృందం జూన్ 29న హైదరాబాద్‌లోని కూకట్ పల్లి, బాలానగర్ లోని హోటళ్లలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలు హోటల్లు రూల్స్ ఉల్లంఘించిట్లు గుర్తించారు. కిచెన్ లో అపరిశుభ్రంగా ఉండటం..కిటీకీలకు తెరలు ఏర్పాటు చేయకుండా దుమ్ము,ధూళి వస్తున్నట్లు గుర్తించారు. పాడై పోయిన కూరగాయలు వాడుతున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో Y జంక్షన్‌లో ఉన్న జంపనాస్ వారాహి హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అవసరమైన ఉష్ణోగ్రత ప్రకారం చికెన్ ను నిల్వ చేయకుండా వాడుతున్నారని తెలిపారు .అంతేకాకుండా తలపాగా, గ్లౌజులు, అప్రాన్‌లు ధరించకుండా వంట చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ప్రాంగణానికి సంబంధించిన పెస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా అందుబాటులో లేనట్లు చెప్పారు అధికారులు.
కూకట్‌పల్లిలోని శ్రీ రాఘవేంద్ర భవన్‌లో కూడా వంటగది ప్రాంతంలో నీరు నిలిచి, అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్‌లలో కొందరు తలపాగా, చేతి గ్లౌజులు.. అప్రాన్‌లు ధరించకుండా వంట చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్‌లోని బాలానగర్‌లోని శ్రీలక్ష్మి గ్రాండ్ ఉడిపి హోటల్‌పై తనిఖీల చేశారు అధికారులు. కుళ్లిపోయిన క్యారెట్లు, ప్యాక్ చేసిన పరాటా వాడుతున్నట్లు గుర్తించారు.
𝗦𝗿𝗶 𝗟𝗮𝗸𝘀𝗵𝗺𝗶 𝗚𝗿𝗮𝗻𝗱 𝗨𝗱𝘂𝗽𝗶 𝗛𝗼𝘁𝗲𝗹, 𝗕𝗲𝘀𝗶𝗱𝗲 𝗕𝗕𝗥 𝗛𝗼𝘀𝗽𝗶𝘁𝗮𝗹, 𝗕𝗮𝗹𝗮𝗻𝗮𝗴𝗮𝗿
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 30, 2024
29.06.2024
* FBO was found operating without valid license.
* Carrots were found rotten & damaged and hence discarded on the spot.
* Packed paratha (ready to cook)… pic.twitter.com/9pnla5NnJi